సూపర్ ఇన్నోవేషన్.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే..ఈ AIహెల్మెట్ పట్టిస్తుంది

సూపర్ ఇన్నోవేషన్.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే..ఈ AIహెల్మెట్ పట్టిస్తుంది

ట్రాఫిక్ లో వెళ్తున్నపుడు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు ఏమనిపిస్తుంది..కోపం వస్తుంది..తర్వాత లైట్ తీసుకుంటాం..కానీ బెంగళూరుకు చెందిన ఈ యువ ఇంజనీరు అలా చేయలేదు.. రోజూ ఉద్యోగానికి వెళ్తున్నపుడు  బెంగళూరు రోడ్లపై తనకు ఎదురైన ట్రాఫిక్ వాయిలెన్స్ కు మొదటి విసుకు చెందినా..ఎలాగైనా  ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఆలోచించాడు.  బెంగళూరుకు చెందిన ఓ ఇంజనీర్ ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డ్ చేసే వినూత్నమైన AI- ఆధారిత హెల్మెట్‌ను తయారు చేశాడు. పంకజ్ తన్వర్ అనే ఈ యువకుడు సోషల్ మీడియాలో తన ఇన్నోవేషన్ పోస్ట్ చేశాడు. ఇది ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తోంది. 

27 ఏళ్ల పంకజ్ తన్వీర్ కు  బెంగళూరు రోడ్లపై వెళ్తున్న ప్రతీసారి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారుల చూస్తూ కోపం వచ్చేది.. విసుక్కునే వాడు..పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకునేవాడు. ప్రతిరోజూ ఇదే గొడవ. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నాడు  పంకజ్.. స్వతహాగా ఇంజనీరు కావడంతో  ఓ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. స్వయంగా ఏఐ హెల్మెట్ ను  తయారు చేశారు. రోడ్లపై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ..ఇట్టే గుర్తిస్తుంది.. ఫలా నా చోట, ఫలానా టైంలో  ట్రాఫిక్ రూల్స్ వాయిలెన్స్ జరిగిందని ఖచ్చితంగా ఫ్రూఫ్ తో సహా చూపిస్తుంది. అంతేకాదు ఆ ఫ్రూఫ్ లను పోలీసులకు పంపిస్తుంది. 

ఇష్టారాజ్యంగా రోడ్లపై వెహికల్స్ నడిపే వారితో విసిగి పోయాను. ప్రతీసారి పోలీసులకు  ఫిర్యాదు  చేయలేం .. అందుకే ఈ AI హెల్మెట్ ను తయారు చేశాను అంటున్నాడు పంకజ్.ఇది ఎప్పుడు నాతో పాటే ఉంటుంది..  రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని  పోలీసులకు పట్టిస్తుంది.. ఏ లోకేషన్లో జరిగింది.. ఏం టైంలో జరిగింది .. ఇలా సమాచారాన్ని  రికార్డు చేసి పోలీసులకు పంపిస్తుందని చెబుతున్నాడు పంకజ్. 

ఈ సూపర్ ఇన్నేవేషన్ కు ఖరీదైన కెమెరాలు ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.. తక్కువ ఖర్చుతోనే అందుబాటులో ఉండే కెమెరాలతోనే డివైజ్ ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచనతో ఈ ఏఐ హెల్మెట్ తయారు చేసినట్లు  పంకజ్ చెబుతున్నాడు. 
ఇక ఈ సూపర్ ఇన్నోవేషన్ ఏఐ హెల్మెట్ తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

 ఈ డివైజ్ హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణీకుడి చుట్టూ రెడ్ కలర్ తో ,లోకేషన్, నంబర్ ప్లేట్ వంటి వివరాలను గుర్తించింది. ఇవి  నేరుగా పోలీసులకు చేరుతాయి. కారు సన్‌రూఫ్ నుంచి ఓ వ్యక్తి తల బయటకు చూపిస్తున్న ఫోటోను కూడా తన్వర్ పోస్ట్ చేశాడు..ఆ పరికరం దానిని  స్టంట్ డ్రైవింగ్ గా గుర్తించింది.

ఈ పోస్టుకు దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. లేక్కలేనన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. చాలా మంది గుంతల సమస్యకు కూడా ఓ సొల్యూషన్ చూడు అంటూ ఈ యువ ఇంజనీరుకు రీపోస్ట్ చేశారు. 

ఇక ఈ పోస్టు బెంగళూరు పోలీసులకు కూడా చేరడంతో పంకజ్ ను  ప్రశంసలతో ముంచెత్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు చెక్ పెట్టేందుకు మీ ఆలోచన బాగుంది అంటూ ట్వీట్ చేశారు.