అంబర్ పేట్, వెలుగు: డొమెస్టిక్సిలిండర్లు బ్లాక్రూట్పట్టడంతో సివిల్ సప్లయీస్సర్కిల్6 అధికారులు గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆఫీసర్దీప్తి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు రెహమాన్ ఖాన్, సావిత్రి, సునీత, సంతోష్, విజయ్ సిబ్బంది రామ్ నగర్, బాగ్ లింగంపల్లి, అంబర్ పేట్, బాగ్ అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డొమెస్టిక్సిలిండర్లను కమర్షియల్అవసరాలకు వాడుతున్న 36 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 17 హెచ్పీ, 8 బీపీసీఎల్,11 ఐఓసీఎల్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
పద్మారావునగర్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో రెండు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో 32 డొమెస్టిక్సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్షీగుట్ట, పద్మారావు నగర్, రెజిమెంటల్ బజార్, తుకారాం గేట్, లాలాపేట్, చిలకలగూడ ప్రాంతాల్లో తనిఖీలు చేసి అక్రమంగా వాడుతున్న సిలిండర్లను గుర్తించారు. సికింద్రాబాద్ అసిస్టెంట్ సివిల్ సప్లయీస్ఆఫీసర్ జి.వి. చాముండేశ్వరి, డీటీలు ఉత్తేజ్ సాగర్, అభిషేక్, శ్రీనివాస్, అరుణ పాల్గొన్నారు.
