బాసెల్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. స్విస్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సాత్విక్–చిరాగ్ 21–15, 15–21, 28–26తో హిరోకి ఒకముర–కోహి యమషిత (జపాన్)పై గెలిచారు.
గంటా 14 నిమిషాల మ్యాచ్‌లో సాత్విక్ జోడీకి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈ క్రమంలో చాలాసార్లు స్కోరు సమం కాగా, చివర్లో రెండు స్మాష్‌లతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 18–21, 21–16, 16–21తో జాసన్ గున్‌వాన్ (హాంకాంగ్) చేతిలో, మెన్స్ డబుల్స్‌లో అర్జున్–హరిహరన్ 17–21, 11–21తో చెన్ సీకే–లిన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు.
