హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రిపుల్ఐటీ జంక్షన్ వద్ద జరుగుతున్న హెచ్ సిటీ ఫ్లైఓవర్ పనులను గురువారం సీఎంసీ కమిషనర్ సృజన పరిశీలించారు. డీఎల్ఎఫ్నుంచి బీహెచ్ఈఎల్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ పనులను మార్చి-2027 లోపు పూర్తి చేయాలని, ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్, ఐఎస్బీ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించే ఫ్లైఓవర్ పనులను మే-2027 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గచ్చిబౌలి–లింగంపల్లి అండర్‌పాస్ పనులను నవంబర్-2027 లోపు పూర్తి చేయాలని సూచించారు. ఫ్లైఓవర్ పనులు పూర్తైన తర్వాత వాటిపై అందంగా కనిపించేలా పెయింటింగ్‌ల కోసం ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన థీమ్‌లను ప్రణాళిక చేయాలని సూచించారు.
హబ్సిగూడలో ఎంఎంసీ కమిషనర్
ఉప్పల్: 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎంఎంసీ కమిషనర్ టి వినయ్ క్రిష్ణ రెడ్డి గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. హబ్సిగూడ సర్కిల్లో అధికారులతో సమావేశమయ్యారు. ఉప్పల్‌లోని పిస్తా హౌస్ సమీపంలోని ఫుట్‌పాత్‌ను, రామంతాపూర్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రామంతాపూర్ శ్రీనివాసపురంలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఇక్కడ వర్షాకాలంలో భారీగా వరద చేరుతుండడంతో పరిష్కారంగా బాక్స్ డ్రైయిన్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.
