జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక.. మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది.. మరికొన్ని రాశుల వారికి చెడు జరుగుతుంది. 2026, జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 4.27 గంటలకు కుజుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం చూపిస్తే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభవాన్ని చూపిస్తోంది. గ్రహాల కమాండర్ కుజుడు రాశి మార్పుతో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం...!
మేషరాశి: కుజుడు మకరరాశిలో సంచారం వలన ఈ రాశి వారు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభరాశి: కుజ గ్రహం సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది . ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభ వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని కూడా తిరిగి పొందవచ్చు. అయితే వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి: మకర రాశిలో కుజ సంచారం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వ్యాపారాల్లో ఏ పెట్టుబడులు పెట్టిన కలిసి రాదు. కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి . లేదంటే వారి నుంచి విడిపోయే పరిస్థితి రావచ్చు. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. తొందరపడి ఈ నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రయాణాలు చేసే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య బాధలు తప్పవు.
కర్కాటక రాశి : కుజుడు .. మకరరాశిలో సంచారనం వలన ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందుతారు. చాలా వరకు పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఫైనాన్షియల్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త బాధ్యతలతో పాటు.. ఆఫీసులో కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహరాశి: కుజుడు.. మకరరాశిలో సంచారం వలన ఈ రాశి వారు కోపాన్ని.. ఆవేశాన్ని నియంత్రించుకోవాని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సమస్యలు ఏర్పడి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో చర్చలకు దూరంగా ఉండే మంచిదని చెబుతున్నారు. అయితే ఉద్యోగులకు ప్రమోషన్ లభించి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి : కుజుడు..మకరరాశిలో సంచరించడం వల్ల ఈ రాశికిచెందిన విద్యార్థులకు చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుందట. ఇప్పటి వరకు ఉన్న ఆర్ధిక సమ్యలు తొలగి ఈ కాలం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల విషయంలో తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
తులా రాశి : కుజుడు స్థానం మారడం వలన ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. వీరి కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. బిజినెస్ చేసే వారు ఊహించని లాభాలు అందుకుంటారు.
వృశ్చికరాశి: మకర రాశిలో కుజ గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ కుటుంబం , వైవాహిక జీవితంలోని అన్ని బాధ్యతలను చూసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశివారికి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగపడుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. వ్యక్తిగత వృత్తి జీవితంలో గొప్ప అవకాశాలు వస్తాయి . పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి . మీరు మీ నాయకత్వ నైపుణ్యాలలో గొప్ప పెరుగుదలను చూస్తారు . మీ కీర్తి బాగా పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో మీ సంబంధంలో మరింత ఆనందాన్ని కొనసాగించగలుగుతారు.
మకరరాశి: జనవరి 16న కుజుడు ఇదే రాశిలోకి మారడంతో ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు రిస్క్ తీసుకున్న అనుకున్న ఫలితాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేప్తారు. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రేమ..పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: కుజుడు మకరరాశిలో సంచారం వలన ఈ రాశి వారు ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు కూడా లాభాలు అందుతాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మీనరాశి : ఈ రాశి వారికి చాలా ఫలప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక-సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు , మద్దతు పొందుతారు. మీ పని ఆధారంగా మీకు కొత్త గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడి నుండి బలమైన లాభాలు కలుగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
