ఇదెక్కడి వారసత్వ పిచ్చిరా బాబూ.. కొడుకు కోసం ఆరాటం.. 11వ కాన్పులో పుట్టిన మగబిడ్డ !

ఇదెక్కడి వారసత్వ పిచ్చిరా బాబూ.. కొడుకు కోసం ఆరాటం.. 11వ కాన్పులో పుట్టిన మగబిడ్డ !

హర్యానాలోని జింద్‌ ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన 11వ కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే 10 మంది ఆడ బిడ్డలు ఉన్నారు. ఈ విషయం గురించి ఆ నోటా ఈ నోటా పాకి మీడియాకు విషయం తెలిసింది. స్థానిక మీడియా నుంచి ఒక మహిళా రిపోర్టర్ వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసింది.

ఆ పిల్లల తండ్రిని కలిసి.. 10 మంది ఆడ పిల్లల పేర్లు చెప్పమని అడిగితే.. పది మందిలో కొందరి పేర్లను కూడా సదరు తండ్రి మర్చిపోయాడు. పదకొండు మంది పిల్లలను ఎలా పెంచి పోషించి ప్రయోజకులను చేయాలనే ఆందోళన కంటే ఒక్క మగ పిల్లాడు పుట్టాడనే ఆనందమే ఆ కుటుంబంలో కనిపించడం చూసి సదరు మహిళా రిపోర్టర్ విస్తుపోయింది.

►ALSO READ | BMC ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా ? కొత్త రూల్.. గెలిస్తే ఏం చేస్తారో జస్ట్ రాసివ్వండి!

మగ పిల్లాడు పుట్టడంతో ఆ కుటుంబం స్వీట్లు పంచి, ఆసుపత్రిని బెలూన్లతో అలంకరించి సంబరాలు చేసుకుంది. వారసత్వంపై ఎందుకు ఇంత ఆరాటం అని ఆ తండ్రిని అడిగితే.. తన కూతుళ్లు తమ కోసం ఒక తమ్ముడిని తీసుకురావాలని అడిగారని చెప్పడం గమనార్హం.

అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఎలాంటి ఎక్కువతక్కువ పరిస్థితులు ఉండవని.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. అయినప్పటికీ కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మగ బిడ్డపై మమకారంతో ఇలా స్తోమతకు మించి పిల్లలను కని పోషించలేక ఇబ్బంది పడుతున్నారని కొందరు నెటిజన్లు ఈ ఘటనపై స్పందించారు.