fake universities: వామ్మో.. దేశంలో ఇన్ని నకిలీ యూనివర్సిటీలా?.. ఢిల్లీలోనే అధికం

fake universities: వామ్మో.. దేశంలో ఇన్ని నకిలీ యూనివర్సిటీలా?.. ఢిల్లీలోనే అధికం

గాల్గోటియాస్ యూనివర్సిటీ వివాదం తర్వాత దేశంలోని యూనివర్సిటీలపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోయూనివర్సిటీ గ్రాండ్ కమిషన్.. దేశంలో ఫేక్ యూనివర్సిటీలపై దృష్టి సారించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఉంటూ నకిలీవిగా గుర్తించబడిన 32 వర్సిటీల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది.ఈ యూనివర్సిటీనుంచి విద్యార్థులు పొందిన డిగ్రీలకు చట్టబద్దత లేదని, ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవని యూజీసీ ప్రకటించింది. నకిలీ యూనివర్సిటీల లిస్టులో ఢిల్లీ టాప్ లో ఉంది. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 12 నకిలీ యూనివర్సిటీలను  గుర్తించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోఅత్యధికంగా ఫేక్ వర్సిటీలు ఉన్నాయి. 

విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా శాఖ పరిధిలోకి పనిచేసే ఈ కమిషన్. ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని తెలిపింది. అడ్మిషన్లు పొందే ముందు విద్యార్తులు ఆ సంస్థల గుర్తింపును ఓసారి చెక్ చేసుకోవలాని యూజీసీ కోరింది. యూజీసీ యాక్టు సెక్షన్ 2(f), 3 ల ప్రకారం ఈ సంస్థలు జారీ చేసి డిగ్రీలకు చట్టపరమైన చెల్లుబాటు లేదని హైలైట్ చేసింది. 

దేశవ్యాప్తంగా నకిలీ యూనివర్సిటీ లిస్టు.. 

ఫేక్ వర్సిటీలు.. రాష్ట్రాల వారీగా.. 

  • ఢిల్లీ - 12 
  • ఉత్తరప్రదేశ్ - 4 
  • ఆంధ్రప్రదేశ్ - 2 
  • కర్ణాటక - 2 
  • కేరళ - 2 
  • మహారాష్ట్ర - 2 
  • పుదుచ్చేరి - 2 
  • పశ్చిమ బెంగాల్ - 2 
  • అరుణాచల్ ప్రదేశ్ - 1 
  • హర్యానా - 1 
  • జార్ఖండ్ - 1 
  • రాజస్థాన్ – 1

►ALSO READ | అన్నింటిని గమనిస్తున్నం: అమెరికా సుప్రీం కోర్టు తీర్పుపై ఇండియా ఫస్ట్ రియాక్షన్