మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేష్ లో జగన్ ఓటమికి కారణం ఈవీఎంలేనని అన్నారు. జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. లబ్ది పొందని వ్యక్తి అంటూ ఉండరని అన్నారు. అలాంటిది 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడమేంటని ప్రశ్నించారు.
ఇప్పటికే 2024 ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఓటమికి కారణం ఈవీఎంలేనని అభిమానులు, కార్యకర్తలు, నేతలు అనుమానం వ్యక్ం చేస్తున్న సమయంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 14 మీటింగులు పెడితే.. 10 మీటింగులలో మిగతా ఇద్దరు ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకించినట్లు గర్తు చేశారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు మంత్రి. ఆ విషయం తెలిసి ఏం చేయలేక 73 లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాలని.. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు . అందుకోసం ఎంతవరకైనా వెళ్తామని అన్నారు.
