ముంబై: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. దివంగత నేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రమాదానికి గురైన లేజర్ జెట్ విమాన యజమాని వీఎస్ఆర్ సంస్థకి రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రోహిత్ పవార్ లేఖ రాశారు. ఈ ఘటనపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తును జరపాలని.. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాదా విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడుని తన పదవికి రాజీనామా చేయమని చెప్పాలని ప్రధాని మోడీని కోరాడు. వీఎస్ఎర్ సంస్థకు డీజీసీఏ అధికారులతో కూడా సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో దర్యాప్తును ప్రధాని మోడీ, అమిత్ షా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని అభ్యర్థించాడు.
►ALSO READ | బెంగళూరు నుంచి గోవాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. 13 గంటల్లోనే టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లిపోవచ్చు..!
దాదా విమాన ప్రమాదం వెనక రెండు రకాలు కుట్రలు జరిగే అవకాశం ఉందని రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశాడు. అజిత్ పవార్‌ను పక్కకు తప్పించేందుకు అతడి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర అయినా చేసి ఉండొచ్చన్నారు. వీఎస్‌ఆర్ సంస్థ ప్రయోజనాల కోసం లేదా భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు జరిగిన కుట్ర కూడా కావొచ్చని అన్నారు.
ప్రమాదానికి గురైన విమానం నడిపిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డ్ పైన సందేహం లేవనెత్తాడు. గతంలో మద్యం సేవించినందుకు మూడు ఏళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన పైలట్ సుమిత్ కపూర్‌కు విమానం నడిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
దివంగత నేత అజిత్ పవార్ 2026, జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించాడు. ఆయనతో పాటు మరో నలుగురు సిబ్బంది చనిపోయారు. ఈ ఘటపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
