పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
అయితే, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు, రవికి విదేశీ పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, రవి దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కాగా, ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవి జైలులోనే ఉంటాడా? అనే సస్పెన్స్ నెలకొంది.
