కొత్త పార్టీ స్థాపించి నడపడం అంత ఈజీ కాదు...కవిత పొలిటికల్ జర్నీపై మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

కొత్త పార్టీ స్థాపించి నడపడం అంత ఈజీ కాదు...కవిత పొలిటికల్ జర్నీపై మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్ జర్నీపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన... ఇపుడున్న పరిస్థితుల్లో  తెలంగాణలో  మరో పొలిటికల్ పార్టీ నడపడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి.. పార్టీలు పెట్టి నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదన్నారు. చిరంజీవి, దేవెందర్ గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశామని చెప్పారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు కవిత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

కవిత రాజీనామాపై 

రాజీనామా ఇన్ పర్సన్  ఇస్తే ఆమోదం అవుతుంది. సభ్యులు కాకుండా ఇతరుల ఇస్తే రాజీనామా ఆమోదం కాదు.  కవిత ఇన్ పర్సన్ ఇచ్చారు ఆమోదం తెలిపాము. మొదట కవిత రాజీనామా పీఏ ద్వారా పంపించారు. ప్రెస్ మీట్ లో రాజీనామా లేఖ పంపించిన్నట్లు మాట్లాడారు. ఇలా చేస్తే రాజీనామా అమోదించలేము కదా..! .రీసెంట్ గా నేరుగా కలిసి రాజీనామా అమోదించాలని కోరారు.. కవిత ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రిజైన్ చేసే వారు ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. శాసనసభ్యులు, మండలి,పార్లిమెంట్  లో ఎక్కడైనా ఇస్తారు. ఆమె రాజీనామా ఎందుకు చేస్తున్నారో కవిత చెప్పారు. దాని నేను ఆపలేను, జడ్జ్  చేయలేను కదా..  కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే అమోదించేవాడిని. ఇటీవలే సెషన్ కి వచ్చిన్నపుడు ఒకసారి ఆలోచించుకోమని చెప్పను. లేదు అమోదించాలి .. అమోదించే ముందు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.

హిల్ట్ పాలసీ ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ ఫ్రీ

 మూసి పొల్యూషన్ నల్గొండ వరకు వస్తోంది. సిటీ పొల్యూషన్ వేరు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వేరు. చౌటుప్పల్  లో గ్రౌండ్ లెవెల్ వరకు పొల్యూషన్ చేరింది. హిల్ట్ పాలసీ ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ ఫ్రీ చేయడమే.  కరప్షన్ కు తావు ఎక్కడ ఉంటది.ప్రభుత్వంలో ఉన్న వారు ప్రభుత్వం ఇచ్చే లెక్కలే చెప్తారు.  ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చేదే నమ్ముతారు కదా. గత పదేళ్లలో గోదావరిపై ఎంత శ్రద్ధ తీసుకున్నారో.. అంత శ్రద్ధ కృష్ణ నది పై తీసుకోలేదు. నేను గతంలో కూడా ఇదే విషయం చెప్పాను.
పొల్యూషన్ కంట్రోల్ అనేది ముఖ్యం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి . ఇది అంత సులువు కాదు అని గుత్తా తెలిపారు.