T20 World Cup: సౌతాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్కి దూసుకెళ్లిన న్యూజిలాండ్.. 

T20 World Cup: సౌతాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్కి దూసుకెళ్లిన న్యూజిలాండ్.. 

T20 World Cup:టీ20 ప్రపంచ కప్ 2026 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ హై-ప్రెజర్ మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా బ్యాటింగ్ చేసిన కివీస్.. కేవలం 12.5 ఓవర్లలోనే మ్యాచ్ గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  169 పరుగులు చేసింది. ప్రోటీస్ జట్టులో  మార్కో జాన్సెన్ అర్థ శతకంతో చెలరేగగా, డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) రాణించడంతో కివీస్ ముందు 170 పరుగులు టార్గెట్ పెట్టింది.   

170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ల ధాటికి ప్రోటీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం 12.5  ఓవర్లలో మ్యాచ్ ని ముగించేశారు.  ఫిన్ అలెన్ (100), టిమ్ సీఫెర్ట్ (58) బ్యాటింగ్ దెబ్బకి సఫారీ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బౌలర్లను మార్చిన ఫలితం మాత్రం మారలేదు. అయితే 6వ ఓవర్ వేసిన కోర్బిన్ బాష్ బౌలింగ్ లో ఫిన్ అల్లెన్ వరుసగా ఐదు (  6, 4, 4, 4, 4 ) బౌండరీలు కొట్టి, ఈ ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.  ఫిన్ అల్లెన్ (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు) అద్భుతమైన సెంచరీ చేయగా, మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో  7 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు) అర్థ శతకం కొట్టిన అనంతరం కగిసో రబడా బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 117 పరుగులు వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ ని కోల్పోయింది. 


అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి ఫిన్ అల్లెన్ మ్యాచ్ ని గెలిపించాడు. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 2. 5 ఓవర్లలో ఏకంగా 53 సమర్పించుకోగా,  కోర్బిన్ బాష్  35 పరుగులు, కేవశ్ మహారాజ్ 33 పరుగులు, కగిసో రబడా 28 రన్స్, లుంగి ఎంగిడి 22 పరుగులు సమర్పించుకున్నారు.  ప్రోటీస్ బౌలర్లలో రబడా ఒక్కడే ఒక వికెట్ తీసుకోగా.. మిగతా బౌలర్లు ధారుణంగా విఫలమైయ్యారు.