ట్రంప్ ఏసు బిడ్డ..ఇరాన్ పై యుద్దం దేవుడి నిర్ణయం.. మనం దేవుడికోసం ఇరాన్ పై యుద్దం చేయాలి. ఇరాన్ సేనలను మట్టు బెట్టాలి.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. స్వయంగా అమెరికా సైనిక కమాండర్లు.. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న ఐదోరోజుకు చేరుకున్న సమయంలో అమెరికా సైనిక కమాండర్లు తమ సైనికులకు చేస్తున్న భోధనలు చర్చనీయాంశంగా మారాయి. ఇలా అమెరికా సైనికులకు కమాండర్లు బోధ చేయడం సైనికుల్లో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి మత స్వేచ్ఛ వాచ్‌డాగ్ మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (MRFF) కు ఫిర్యాదు చేశారు.
బ్రీఫింగ్‌కు హాజరైన NCOలలో ఒకరు 15 మంది సైనికుల తరపున మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిలో 11 మంది క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక యూదు ,ఇద్దరు నాస్తికులు ఉన్నారని మొదట ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జోనాథన్ లార్సెన్ తన సబ్‌స్టాక్‌లో రిపోర్టు చేశారు.
కమాండర్ల వ్యాఖ్యలపై అమెరికా అన్ని సైనిక విభాగాల్లోని సైనికులనుంచి దాదాపు 30 స్థావరాల్లో 40కి పైగా యూనిట్లనుంచి 110 కిపైగా కంప్లైంట్స్ వచ్చాయి. అమెరికా సైన్యం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఉండటంతో వారంతా కమాండర్లవ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు.
అయితే కమాండర్ వ్యాఖ్యలు సైనికుల్లో ధైర్యాన్ని ,యూనిట్ సమన్వయాన్ని నాశనం చేస్తాయని, రాజ్యాంగానికి మద్దతు ఇస్తామని మేము ప్రమాణం చేసిన ప్రమాణాలను ఉల్లంఘిస్తాయని బ్రీఫింగ్ కు హాజరైన నాన్ కమిషన్డ్ అధికారులు హెచ్చరించారు.
