T20 World Cup: దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన కివీస్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

T20 World Cup: దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన కివీస్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన హై-ప్రెజర్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టీమ్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  169 పరుగులు చేసింది సఫారీ జట్టు. ప్రోటీమ్ టీమ్ ని మార్కో జాన్సెన్ అర్థ శతకంతో ఆదుకోగా, డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) ఫర్వలేదనిపించారు. కాగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ప్రోటీస్ జట్టుని కివీస్ బౌలర్ కోల్ మెక్‌కాంచీ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రెండో ఓవర్ వేసిన మెక్‌కాంచీ బౌలింగ్ లో క్వింటన్ డి కాక్ ,  ర్యాన్ రికెల్టన్ వరుసగా ఔట్ అయ్యారు.  

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన  డెవాల్డ్ బ్రెవిస్ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు వద్ద  జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో అవుట్ కాగా, డేవిడ్ మిల్లర్ మాత్రం తీవ్రంగా నిరాశ పర్చాడు. కేవలం 6 రన్స్ చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ చివర్లో కాసేపు కివీస్ బౌలర్లపై దూకుడుగా బ్యాటింగ్ చేసి లూకీ ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఇక చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన మార్కో జాన్సెన్ ఒక్కడే నిలబడి ప్రోటీస్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈరోజు సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (10 ), ఐడెన్ మార్క్రామ్ (18), ర్యాన్ రికెల్టన్ ( 0), డేవిడ్ మిల్లర్ ( 6), కోర్బిన్ బాష్ ( )2, కాగిసో రబడ ( 0) దారుణంగా విఫలమయ్యారు.