మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆయన నటించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇది చిరు కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ మూవీ (మెగా 158)కి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
తాజాగా ఈ చిత్రంపై ఇంట్రె స్టింగ్ అప్డేట్ వచ్చింది. బాబీ ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కీరాక్ స్క్రిప్ట్ను లాక్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇదొక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇందులో చిరు కోసం బాబీ ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేశాడని, మెగాస్టార్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణితో పాటు పలువురు ప్రముఖ నటులను రంగంలోకి దించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.
ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. బాబీ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్ లో భారీ యాక్షన్ సీక్వెస్ స్ ను డిజైన్ చేశాడట. కేవీఎస్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చి ఎండింగ్ నుంచిచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
