కుల పెద్దల మాట వినలేదని..ఏడేండ్లుగా కుటుంబ బహిష్కరణ

కుల పెద్దల మాట వినలేదని..ఏడేండ్లుగా  కుటుంబ బహిష్కరణ

జగిత్యాల: కుల పెద్దల మాట వినలేదని ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జరిగింది. పెంచికలపేట మండలానికి చెందిన పెండెష్ తో వాంకిడి మండలానికి చెందిన లావణ్యకు 2016లో వివాహం జరిగింది. అయితే లావణ్య తల్లిదండ్రులకు ఒకే ఆడబిడ్డ కావడంతో అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చి వాంకిడిలో బార్బర్ షాపు పెట్టించాడు.

 తమ అనుమతి లేకుండా షాపు పెట్టడంపై కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసిన షాపులో నాలుగు కుర్చీలు కాకుండా రెండు కుర్చీలు పెట్టాలని ఆదేశించారు. మాట వినక పోవడంతో ఏడేళ్ల నుంచి తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి.. ఎవరి ఇంట్లో శుభకార్యం ఉన్న తమను పిలవకుండా తమ ఇంటికి రానివ్వకుండా కుల పెద్దలు వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.