శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. జనవరి 12 నుంచి 18 వరకు ఈ సేవలు నిలిపివేత..

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. జనవరి 12 నుంచి 18 వరకు ఈ సేవలు నిలిపివేత..

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో జనవరి 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.పాంచాహ్నిక దీక్షతో 7 రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు. ప్రతి సంవత్సరం సంక్రాంతి,శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీ అని.. ఈ ఏడాది కూడా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పలు సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపారు అధికారులు.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్:

  • జనవరి 12న ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం 
  • 13 నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు
  • 15న శ్రీస్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం 
  • కళ్యాణానికి చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక ఆహ్వానం

ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12నుండి 18 వరకు రుద్ర,చండి,మృత్యుంజయ,గణపతి హోమాలు, నిలిపివేయనున్నామని.. శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం,ఉదయాస్తమాన, ప్రాతఃకాల,ప్రదోషకాల,ఏకాంత సేవలు కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు.