అందరూ ఒకటే సొల్లు చెప్తున్నరు.. ట్రై న్యూ బ్రో: శాంట్నర్‎కు సూర్య కౌంటర్

 అందరూ ఒకటే సొల్లు చెప్తున్నరు.. ట్రై న్యూ బ్రో: శాంట్నర్‎కు సూర్య కౌంటర్

న్యూఢిల్లీ: ‘వాళ్ల సొంత గడ్డపైనే లక్షలాది మంది ఇండియన్ ఫ్యాన్స్ నోళ్లు మూయిస్తాం’.. 2023 వన్డే వరల్డ్ కప్‎లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‎కు ముందు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలివి. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‎కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ కూడా ఇవే తరహా కామెంట్స్ చేశాడు. 2026,  మార్చి 8న అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరులో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మ్యాచ్‎కు ముందు శనివారం (మార్చి 7) కివీస్ కెప్టెన్ శాంటర్న్ ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‎లో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఇండియాతో తలపడే సమయంలో కిక్కిరిసిన భారత ప్రేక్షకుల నోర్లు మూయించడానికి తమ జట్టు ప్రయత్నిస్తుందని అన్నాడు. ట్రోఫీని ఎత్తడానికి కొన్ని హృదయాలను విచ్ఛిన్నం చేయడానికి మాకు అభ్యంతరం లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. 

ఫైనల్ మ్యాచ్‎లో అతిథ్య భారత్ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో శాంట్నర్ సైలెన్స్ హోమ్ క్రౌడ్ కామెంట్స్‎పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‎లో సూర్య మాట్లాడుతూ.. పెద్ద మ్యాచ్‌లకు ముందు ప్రత్యర్థుల నుంచి ఇటువంటి ప్రకటనలు కామన్ అయిపోయాయని ఎద్దేవా చేశాడు. 

అందరూ ఒకటే సొల్లు చెబుతున్నారని.. వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని సెటైర్ వేశాడు. ఇక, స్వదేశంలో ప్రపంచ కప్ ఫైనల్ ఆడే సందర్భాన్ని ఇండియా టీమ్ ఆస్వాదిస్తున్నదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ వాతావరణం ఉందని చెప్పాడు. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకుంటామనే నమ్మకం ఉందని స్కై ధీమా వ్యక్తం చేశాడు.