తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, నారాయణగిరి షెడ్ల  వరకు క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. 

శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి  20 గంటలు, టైమ్ స్లాట్ (SDD) దర్శనానికి సుమారు 8 గంటలు,రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ‌

ఇక శుక్రవారం  ( మార్చి6) తిరుమల శ్రీవారిని 59వేల194 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25వేల295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.87 కోట్లు సమర్పించారు...

►ALSO READ | ఏపీ,కర్నాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. 13 ఏండ్లలోపువారు వాడకుండా ఏపీలో నిషేధం