రాత్రికి రాత్రే షాకిచ్చిన కేంద్రం.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంపు !

రాత్రికి రాత్రే షాకిచ్చిన కేంద్రం.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంపు !

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై పడటంతో ఇండియాలో ఎల్పీజీ గ్యా్స్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచడంతో సామాన్యుల నెత్తిన పెద్ద బండ పడింది. నేటి నుంచే (మార్చి 7 నుంచి) డొమెస్టిక్ LPG ధర రూ.60 పెంపు, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెంపు అమల్లోకి రావడం గమనార్హం. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరిగింది.

గ్యాస్ ధరలను పెంచడంతో ‘ఎక్స్’లో Rs 60, Rs 115 ట్రెండింగ్లో నిలిచాయి. ఇండియాలో ఇంధన కొరత, గ్యా్స్ కొరత లేదంటూనే కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం పరిస్థితులు ఇలానే కొనసాగితే.. రేపోమాపో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగొచ్చనే ఊహాగానాలు గ్యాస్ ధరల పెంపుతో మరింత బలపడ్డాయి.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో ఇండస్ట్రీయల్, ఆటోమొబైల్ రంగాలకు సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీల సరఫరాపై కూడా పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు 8 లక్షల సిలిండర్ల సరఫరా అవుతుండగా..ఈ సప్లయ్ ని ఇప్పుడు కేంద్ర నిర్ణయం నేరుగా దెబ్బ తీయనుంది.

ఒక్క హైదరాబాద్​లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్‌‌‌‌‌‌‌‌లు నుంచి స్టార్​ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి  రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. రెండు రోజులుగా బల్క్ ట్యాంకర్ల సరఫరా ఆగిపోయింది. శుక్రవారం నుంచి ఇండస్ట్రీలు, కమర్షియల్ వాడకాలకు సరఫరా పూర్తిగా ఆగిపోయాయి.