మేడారం జాతరలో ఇంటర్ అమ్మాయితో హోంగార్డు ప్రేమ... భార్య పిల్లలు ఉండగానే..

మేడారం జాతరలో ఇంటర్ అమ్మాయితో హోంగార్డు ప్రేమ... భార్య పిల్లలు ఉండగానే..

మేడారం జాతర ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచే కాకుండా దేశ,విదేశాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో ఘనంగా జరిగింది. ఈ జాతరలో భక్తులు సమ్మక్క సారలమ్మలకు తమ మొక్కులు చెల్లించుకుంటే.. ఓ హోంగార్డు మాత్రం ఇంటర్ అమ్మాయిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నాడు.భార్య, పిల్లలు ఉన్న ఓ హోంగార్డు మేడారం జాతరలో ఇంటర్ అమ్మాయిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకుని.. రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ కి చెందిన ఓ హోంగార్డుకు మేడారం జాతరలో ఇంటర్ అమ్మాయి పరిచయం అయ్యింది. జాతర ముగించుకొని సిటీకి వచ్చాక అమ్మాయితో మాటలు కలిపాడు సదరు హోంగార్డు. దీంతో ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో 20 రోజుల వ్యవధిలోనే ప్రేమలో మునిగిపోయి పెళ్లి కూడా చేసేసుకున్నారు ఇంటర్ అమ్మాయి, హోంగార్డు.

►ALSO READ | ఆన్‌‌లైన్‌‌లో సీతారాముల కల్యాణం టిక్కెట్లు..  భద్రాచలం రాములోరి పెళ్లి ఉత్సవాలు

భార్య, పిల్లలు ఉన్నప్పటికీ ఇంటర్ అమ్మాయిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్న హోంగార్డు.. రక్షణ కోసం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.  ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.