సుందర్ పిచాయ్ కి 63 వేల కోట్ల జీతం!..శాలరీ ప్యాకేజీ ప్రకటించిన గూగుల్

సుందర్ పిచాయ్ కి 63 వేల కోట్ల జీతం!..శాలరీ ప్యాకేజీ ప్రకటించిన గూగుల్

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తమ సీఈఓ సుందర్ పిచాయ్ కి వచ్చే మూడు సంవత్స రాలకు మొత్తం 692 మిలియన్ డాలర్ల ప్యాకేజ్ ప్రకటించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.63 వేల కోట్లకు పైగా అవుతుంది. ఇందులో ప్రధాన భాగం పనితీరు ఆధారిత స్టాక్ యూనిట్ల రూపంలో ఉంటుంది. వీటి విలువ 126 మిలియన్ డాలర్లు కాగా కంపెనీ లక్ష్యాలు అధిగమిస్తే అది 252 మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. 

అదనంగా మూడు సంవత్సరాల పాటు ప్రతి నెల లిస్టయ్యే విధంగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్, ఏడాదికి 2 మిలియన్ డాలర్ల జీతం కూడా ఉంటుంది. స్వయం నియంత్రిత టెక్నాలజీ ప్రాజెక్టుల అభివృద్ధికి అనుసంధానంగా 350 మిలియన్ డాలర్ల వరకు స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వనున్నారు. ఇందులో వేమో ప్రాజెక్టు నుంచి 130 మిలియన్ డాలర్లు, వింగ్ ఏవియే షన్ నుంచి 45 మిలియన్ డాలర్ల స్టాక్ లు ఉండనున్నాయి. 

2015లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ మార్కెట్ విలువను పిచాయ్ దాదాపు 7 రెట్లు పెంచినట్లు ఆల్ఫాబెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం ఆయన ప్రపంచంలో అత్యధిక పారి తోషికం పొందే సీఈఓల్లో ఒకరిగా నిలిచారు.