ఈ వారం వరుసగా పడిపోతూ వచ్చిన బంగారం రేట్లు వీకెండ్ తిరిగి పుంజుకున్నాయి. ఇరాన్ యుద్ధం సమయంలో గోల్డ్ రేటు పెరగటానికి బదులుగా తగ్గుతూపోయి ఆశ్చర్యపరచింది. అయితే వీకెండ్ నాటికి తిరిగి ఉప్పెనలా రేట్లు పెరగటంతో భారతీయ కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. అయితే షాపింగ్ చేయాలని అనుకుంటున్న రిటైలర్లు ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ విక్రయ ధరలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
మార్చి 7న బంగారం రేట్లు భారీగా పెరిగింది. దీంతో మార్చి 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.251 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 364గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేలుగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే మార్చి 7, 2026న దేశవ్యాప్తంగా రేట్లలో మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.
