ఛాతీ నొప్పి వచ్చి, తగ్గిందా ? జాగ్రతః ఈ లక్షణాలు కనిపిస్తే అది గుండెపోటు వార్నింగ్ కావచ్చు !

 ఛాతీ నొప్పి వచ్చి, తగ్గిందా ? జాగ్రతః ఈ లక్షణాలు కనిపిస్తే అది గుండెపోటు  వార్నింగ్ కావచ్చు !

గుండెపోటు అంటే కేవలం సినిమాలో చూపించినట్లు ఒక్కసారిగా ఛాతీ పట్టుకుని కింద పడిపోవడం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి పరిస్థితి చాలా వేరేల ఉంటుంది. చాలా మందికి ఛాతీలో ఏదో అసౌకర్యం అనిపించడం, కొద్దిసేపటి తర్వాత సాధారణం అవడం జరుగుతుంటుంది. ఇలా నొప్పి వచ్చి పోతుండటంతో ఇది గ్యాస్ ట్రబుల్ కావచ్చు లేదా అలసిపోవడం వల్ల వచ్చిన నొప్పి అని మనల్ని మనం సర్దిచెప్పుకుంటాం. కానీ, కార్డియాలజిస్టుల ప్రకారం, ఇలా వచ్చి.. పోయే ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలను రక్షించే చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

 మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు పూర్తిగా మూసుకుపోకుండా, కొంత వరకు అడ్డంకులు ఏర్పడినప్పుడు ఇలాంటి అప్పుడప్పుడు వచ్చే ఛాతి నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మీరు వేగంగా నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు లేదా ఏదైనా బరువు ఎత్తినప్పుడు గుండెకు ఎక్కువ రక్త ప్రసరణ అవసరమవుతుంది. అడ్డంకుల వల్ల రక్తం సరిగ్గా అందనప్పుడు ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా అనిపిస్తుంది. మీరు పని ఆపేసి కూర్చున్నప్పుడు/ విశ్రాంతి తీసుకున్నప్పుడు గుండెకు తక్కువ రక్తం సరిపోతుంది కాబట్టి, ఛాతినొప్పి నొప్పి మాయమవుతుంది.నొప్పి తగ్గిపోయింది కదా అని మనం ఎం ప్రమాదం లేదని అనుకుంటాం....ఇదంతా అపోహ...  కానీ లోపల ఉన్న అడ్డంకి అలాగే ఉంటుంది, అది రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.

మీరు లైట్ తీసుకోకూడని వార్నింగ్  సంకేతాలు:
నొప్పి ఎక్కివగా లేకపోయినా, కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఛాతీపై  ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించడం, ఛాతీలో మొదలైన నొప్పి  నెమ్మదిగా ఎడమ చేయి, దవడ, మెడ లేదా వీపు భాగాలకు పాకడం, చిన్న పనికే ఊపిరి అందకపోవడం, శ్వాస  కోసం ఇబ్బంది పడటం, ఏసీలో ఉన్నా లేదా చల్లని వాతావరణంలో ఉన్నా అకస్మాత్తుగా  చెమటలు పట్టడం, ఏ పనీ చేయకపోయినా బాగా నీరసించిపోవడం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. 

గుండె సమస్యలకి కారణాలు... 
అప్పుడప్పుడు  వచ్చే  ఛాతి నొప్పికి  కొన్ని కారణాలు ఉండొచ్చు 
*గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గిపోవడం వల్ల  'ఆంజినా' (Angina) అనే ఛాతీ నొప్పికి దారి తీస్తుంది.
*కొన్నిసార్లు  గుండెపోటు రాకముందే, చిన్న చిన్న హెచ్చరికలు కనిపిస్తాయి. వీటిని గుర్తించకపోతే చాల ప్రమాదం జరగొచ్చు. 
*గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు రావడం వల్ల కూడా ఛాతీలో దడ, అసౌకర్యం కలుగుతాయి.
*గుండెలోని కవాటాలు సరిగ్గా పని చేయకపోయినా రక్త ప్రసరణకు ఆటంకం కలిగి నొప్పి వస్తుంది.


గుండె సమస్యను మొదట్లోనే  గుర్తిస్తే చాలా సులభంగా చికిత్స చేయవచ్చు. మీరు నొప్పిని నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా వెళ్తే, గుండె కండరాలు దెబ్బతింటాయి. మొదట్లో అయితే కేవలం మందులు, ఆహారం, వ్యాయామం ద్వారా  గుండెను కాపాడుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ద్వారా వాటిని తొలగించవచ్చు. తీవ్రమైన మరింత ముదిరి క్లిష్ట పరిస్థితికి చేరితే  బైపాస్ సర్జరీ తప్పనిసరి అవుతుంది. గుండె మనకు ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నొప్పి తగ్గిపోయింది కదా అని  పట్టించుకోకుండా ఉంటె ముంచుకొస్తున్న ప్రమాదానికి ఆహ్వానం పలకడమే.