వరంగల్ చౌరస్తాలో కత్తితో మహిళ హల్ చల్.. భర్త వివాహేతర సంబంధ పెట్టుకున్నాడని రచ్చరచ్చ !

వరంగల్ చౌరస్తాలో కత్తితో మహిళ హల్ చల్.. భర్త వివాహేతర సంబంధ పెట్టుకున్నాడని రచ్చరచ్చ !

వరంగల్ నడిబొడ్డున.. నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో.. ఒక మహిళ కత్తి పట్టుకుని చేసిన హంగామా కాసేపు టెన్షన్ కు గురిచేసింది.  జువెలరీ షాపు ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగటంతో అక్కడున్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంటపడటంతో.. భర్త ఒక దుకాణంలో దాక్కున్నాడు. బుధవారం (జనవరి 07) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తన భర్త తనకు కావాలంటూ వరంగల్ చౌరస్తాలో ఓ మహిళ కత్తి పట్టుకుని హల్ చల్ చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగింది. అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేస్తున్నాడని.. తన కూతురిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగింది. కత్తి పట్టుకుని హల్ చల్ చేస్తున్న మహిళను పోలీసులు, అక్కడున్న వారు సర్దిచెప్పినా శాంతించకపోవడంతో.. ఆమె నుంచి కత్తిని లాక్కున్నారు పోలీసులు.

వరంగల్ సిటీలోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ నర్సంపేట చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి  వైష్ణవి (10) అనే కూతురు ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. భర్త తమను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. 

మరోవైపు జ్యోత్స్న మానసిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్ వైష్ణవితో దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో జోష్ణ తన భర్త బంగారం షాపు అయిన వైష్ణవి జువెలర్స్ ముందు కత్తి పట్టుకొని హంగామా సృష్టించింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోత్స్న ఆరోపిస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజారి గంజ్ పోలీసులు జోత్స్న, ఆమె మామ లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.