నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తోందని, మహిళా సంఘాలు పూర్తి స్థాయిలో పథకాలను వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. శనివారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని బుధరావుపేటలో ఆయన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబుతో కలిసి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నల్లబెల్లి మండలం కొండాయిలపల్లిలో ఏర్పాటు చేసిన మిర్చిసాగుపై రైతులకు అవగాహన సదస్సుకు కలెక్టర్ సత్యశారదతో కలిసి హాజరై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వనశాఖ ఆఫీసర్ శ్రీనివాసరావు, అనురాధ, సురేఖ, రవీందర్ రెడ్డి, నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
