హైదరాబాద్లో ఈ ఏరియాల్లో రెండ్రోజులు నీళ్లు బంద్.. నీళ్లు పొదుపుగా వాడుకోండి..!

హైదరాబాద్లో ఈ ఏరియాల్లో రెండ్రోజులు నీళ్లు బంద్.. నీళ్లు పొదుపుగా వాడుకోండి..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మంచినీటి సరఫరాకి అంతరాయం ఉంటుందని జలమండలి తెలిపింది. సింగూరు ప్రాజెక్ట్ ఫేజ్–3 మెయిన్ పైప్‌ లైన్‌కి లీకేజీలు రావడంతో పెద్దపూర్ నుంచి సింగాపూర్ వరకు జలమండలి సిబ్బంది పైప్‌ లైన్‌కి మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. 

ఈ కారణంగా.. జనవరి 8 గురువారం ఉదయం 10 గంటల నుంచి జనవరి 9 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి బోర్డు తెలిపింది.

ఈ కారణంగా.. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు.. మాదాపూర్, కొండాపూర్, ISB, బాలానగర్, మూసాపేట,ఫతేనగర్‌, హఫీజ్‌పేట్, మియాపూర్, మయూరి నగర్, ప్రగతినగర్, బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీయూ, చందానగర్..  నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ఈ ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

►ALSO REA D | నాపై డ్రగ్స్ కేసు కొట్టేయండి: హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్