ఊటీలో 100 అడుగుల లోతున్న లోయలో పడిన బస్సు

ఊటీలో 100 అడుగుల లోతున్న లోయలో పడిన బస్సు

ఊటీ: తమిళనాడులోని ఊటీ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 100 అడుగుల లోయలో పడింది. డ్రైవర్ డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి ఇలా లోయలో పడింది. మనలాడ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీళ్లలో..17 మంది పురుషులు, 12 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. స్థానిక ప్రజలు క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు.

పలాడ గ్రామ ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి వెంటనే ఉదగై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి మెరుగైన వైద్యం నిమిత్తం క్షతగాత్రులను తరలించారు. వారందరికీ చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

►ALSO READ | ఆ వార్త చదివి గుండె ముక్కలైంది: బంగ్లాదేశ్‎లో హిందూ వితంతువుపై దాడిని తీవ్రంగా ఖండించిన ధావన్