ఆ వార్త చదివి గుండె ముక్కలైంది: బంగ్లాదేశ్‎లో హిందూ వితంతువుపై దాడిని తీవ్రంగా ఖండించిన ధావన్

ఆ వార్త చదివి గుండె ముక్కలైంది: బంగ్లాదేశ్‎లో హిందూ వితంతువుపై దాడిని తీవ్రంగా ఖండించిన ధావన్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‎లో హిందూ వితంతువుపై జరిగిన దాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ధావన్.. ఎవరిపైనైనా, ఎక్కడైనా ఇటువంటి హింస ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. 

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఒక హిందూ వితంతువుపై జరిగిన దారుణ దాడి గురించి చదివి గుండె బద్దలైంది. ఎవరిపైనా, ఎక్కడైనా ఇటువంటి హింస ఆమోదయోగ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలని ప్రార్థి్స్తున్నా’’  అని ధావన్ పేర్కొన్నారు. 

స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్‏లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. క్రమంగా ఈ నిరసనలు ఇండియాకు వ్యతిరేకంగా మారాయి. ఓ వర్గం మెనార్టీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. రెండు వారాల వ్యవధిలో దాదాపు ఐదుగురు హిందువులపై దాడి చేసి చంపేశారు.

ఇదిలా ఉండగానే.. జెనైదా ఉప జిల్లా అయిన కాలిగంజ్‌లో 40 ఏళ్ల హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఆ మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారగా ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.