హైదరాబాద్: మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న రేవంత్ సర్కార్ లక్ష్యం దాదాపుగా నెరవేరింది. డీజీపీ శివధర్ రెడ్డి ముందు నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి డీజీపీ ముందు లొంగిపోయారు.
దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు. ఈ కీలక నేతల లొంగుబాటుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా తెలంగాణలో మావోల ప్రస్థానానికి ముగింపు పలికినట్లయింది. అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
1982లో దేవ్ జీ నక్సలిజంలోకి వెళ్లాడని.. ఇప్పటిదాకా 590 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. ఇంకా.. 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. అండర్ గ్రౌండ్ లో ఉన్నవాళ్లు జన జీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ఇస్తామని డీజీపీ తెలిపారు.
గణపతి అడవుల్లో లేడని.. బయట ఉన్నాడని డీజీపీ చెప్పడం గమనార్హం. పసునూరి నరహరి జార్ఖండ్ లో పనిచేస్తున్నాడని చెప్పారు. జోడె రత్నాభాయ్ అలియాస్ సుజాత లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.
