IND VS ZIM T20 WC26: జింబాబ్వేపై గెలిచి భారత్ నెట్ రన్రేట్  మెరుగుపరచుకోగలదా..?

IND VS ZIM T20 WC26: జింబాబ్వేపై గెలిచి భారత్ నెట్ రన్రేట్  మెరుగుపరచుకోగలదా..?

IND VS ZIM T20 WC26: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో నిన్న జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీఫైనల్ చేరుకునే ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ ఫలితంతో సూపర్-8 గ్రూప్ పట్టిక పూర్తిగా మారిపోయింది. వెస్టిండీస్ అగ్రస్థానానికి చేరుకోగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుండగా టీమిండియా థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. ఈ ఓటమితో భారత్‌కు కేవలం రెండు పాయింట్లు మాత్రమే కాకుండా, నెట్ రన్‌రేట్‌కు కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ -3.800గా ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. 

సూపర్-8 దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో.. భారత్‌కు సెమీస్ చేరు అవకాశాలు దాదాపు కష్టమే అని చెప్పాలి. ఇండియా సెమీఫైనల్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, భారీ అధిక్యంతో విజయాలు సాధించి నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కేవలం గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా టీమిండియా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  

►ALSO READ | కర్నాటకకు ఎదురుందా?.. ఇవాళ్టి నుంచి జమ్మూతో రంజీ ట్రోఫీ ఫైనల్ ఫైట్

ఫిబ్రవరి 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 76 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది. దీంతో నెట్ రన్ రేట్ కూడా బాగా పడిపోవడంతో.. సెమీస్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి.