కర్నాటకకు ఎదురుందా?.. ఇవాళ్టి నుంచి జమ్మూతో రంజీ ట్రోఫీ ఫైనల్ ఫైట్

కర్నాటకకు ఎదురుందా?.. ఇవాళ్టి నుంచి జమ్మూతో రంజీ ట్రోఫీ ఫైనల్ ఫైట్

హుబ్బలీ: ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో అతి పెద్ద టోర్నీ అయిన రంజీ ట్రోఫీ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చే ఫైనల్ పోరుకు వేళయింది. ఎనిమిది సార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన బలమైన కర్నాటక జట్టు, తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరి చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌తో మంగళవారం మొదలయ్యే టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో తలపడనుంది. 

కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ ఆటగాళ్లతో కర్నాటక అత్యంత బలంగా కనిపిస్తూ తొమ్మిదో ట్రోఫీపై గురిపెట్టింది.  బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి టాప్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన జమ్మూ అదే జోరుతో  ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అనుభవం, స్టార్ పవర్ ఉన్న కర్నాటక ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. పారస్ డోగ్రా నేతృత్వంలోని కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కర్నాటక బ్యాటర్లకు, జమ్మూ పేసర్ ఆకిబ్ నబీకి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఆకిబ్ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 55 వికెట్లతో ఫుల్‌‌ఫామ్‌‌లో ఉన్నాడు.