నోయిడాలో పట్టపగలే దారుణ హత్య: పిల్లలు ఆడుకుంటుండగా కాల్పులు.. అరుపులు ! సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు!

నోయిడాలో పట్టపగలే దారుణ హత్య: పిల్లలు ఆడుకుంటుండగా కాల్పులు.. అరుపులు !  సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు!

గ్రేటర్ నోయిడాలో పట్టపగలే ఒక యువకుడిని దారుణంగా కాల్చి చంపారు. అతని ఇంటి ముందే అందరూ చూస్తుండగానే తుపాకులతో కాల్చేశారు. ఈ భయంకరమైన సంఘటన మొత్తం అక్కడ ఉన్న CCTV కెమెరాల్లో రికార్డైంది.

సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే... గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో నితిన్ అనే యువకుడు అతని ఇంటి దగ్గరలో ఉన్నాడు. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, ఒక్కసారిగా  కొందరు దుండగులు తుపాకులతో అతని ఇంటి సందులోకి వచ్చారు. నితిన్ కనిపించగానే వెంబడించి పట్టుకొని వరుసగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న నితిన్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ  చనిపోయాడు.

భయంతో పరుగులు తీసిన పిల్లలు:
ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా మారింది. ఇంటి సందులో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారోగాని ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో  పిల్లలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. నితిన్ ఇంటి గేటు దగ్గర ఉన్న ఓ మహిళ కాల్పుల ఘటన చూసి భయంతో గట్టిగా కేకలు వేయగా.. దుండగులు ఆమెని తుపాకీతో భయపెట్టడం  వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం ఏంటంటే కొన్ని సెకన్లలో ఆ ప్రాంతం నుండి తప్పించుకున్నారు. 

పోలీసుల దర్యాప్తు:
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. అదే గ్రామానికి చెందిన సచిన్ అనే వ్యక్తి అతని అనుచరులతో కలిసి నితిన్‌ను చంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.... గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపులు చేస్తున్నారు. 

►ALSO READ | వీడేం మనిషి.. 25 ఏళ్ల తర్వాత తిరిగొస్తే.. తల్లివే కాదు పొమ్మంటాడా?