పాస్టర్ అయి ఉండి ఏంటీ పాపపు పని.. వెలుగులోకి ఉప్పల్ లివింగ్ వే చర్చ్ పాస్టర్ బాగోతం

పాస్టర్ అయి ఉండి ఏంటీ పాపపు పని.. వెలుగులోకి ఉప్పల్ లివింగ్ వే చర్చ్ పాస్టర్ బాగోతం

హైదరాబాద్: పాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఉప్పల్లోని లివింగ్ వే చర్చిలో ఫాస్టర్గా ఉంటూ అక్కడ పరిచయమైన ఓ ప్రభుత్వ ఉద్యోగురాలిని ప్లాన్ ప్రకారం ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై లక్షలు రూపాయలు బాధితురాల నుంచి తీసుకొని సదరు పాస్టర్ మోసం చేశాడు.

పెళ్లి పేరు ఎత్తగానే ఎందుకు మొహం చాటేస్తున్నాడని బాధితురాలు ఆరా తీయగా, మరో వివాహితతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు వెలుగు చూసింది. ఇదేంటిని ప్రశ్నిస్తే నిన్ను చంపేస్తానని, ఎక్కడ ఉన్నా నీ అంతు చూస్తానని బెదిరింపులకు దిగాడు. వివాహేతర సంబంధం ఉన్న మహిళతో మూడు నెలలకు ఒకసారి దుబాయ్, గోవా, కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తున్నాడని, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ మహిళ ఇంట్లోనే ఉండడంతో బాధితురాలు నిలదీసింది.

ALSO READ : హైదరాబాద్లో వర్షం.. 

నువ్వు నా జీవితంలో ఉండాలంటే నా ఫ్రెండ్ భార్య కూడా నాతో ఉంటుందని చెప్పడంతో బాధితురాలు అవాక్కయింది. చర్చ్ ఫాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్తో ప్రాణహాని ఉందని బాధితురాలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సందీప్ వెనుక సికింద్రాబాద్ చెందిన మరో పాస్టర్ ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకి దిగుతున్నట్లు ప్రభుత్వ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.