T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో పాకిస్థాన్ జట్టు కీలక మ్యాచ్‌కు రెడీ అవుతుంది. ఈరోజు (ఫిబ్రవరి 24న) పాక్–ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ దాయాది జట్టుకి ఎంతో కీలకం, ఎందుకంటే సెమీఫైనల్ అవకాశాలు ఈ మ్యాచ్ ఫలితంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్, ఇంగ్లాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. అందుకే ఈ మ్యాచ్‌లో ఆ చెత్త రికార్డును చెరిపేయాలని పాక్ జట్టు పట్టుదలతో ఉంది.
సెమీఫైనల్ ఆశలు:
న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, క్వాలిఫికేషన్ రేసులో దాయాది జట్టు వెనకకు పడిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగే మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలిస్తేనే సెమీస్ కు అర్హత సాధించే పరిస్థితి ఏర్పడింది.
వాతావరణ పరిస్థితులు
అక్యూవెదర్ తెలిపిన సమాచారం ప్రకారం.. పల్లెకెలెలో ఈ రోజున వాతావరణం ఎక్కువగా ఎండగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వేళ కొద్దిగా మేఘాలు వచ్చినప్పటికీ, వర్షం పడే అవకాశం కేవలం 13 శాతం మాత్రమే ఉంది. దీంతో పూర్తి స్థాయి మ్యాచ్ జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
ఇంగ్లాండ్‌కు ఆధిక్యం:
ఈ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు మంచి ఎక్సిఫిరియన్స్ కలిగి ఉంది. ఈ నెల ప్రారంభంలోనే పల్లెకెలెలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అలాగే సూపర్-8 దశలో శ్రీలంకను కూడా ఓడించింది. ఇవన్నీ ఇంగ్లాండ్‌కు బూస్ట్ ఇస్తున్నాయి.
►ALSO READ | IND VS ZIM T20 WC26: జింబాబ్వేపై గెలిచి భారత్ నెట్ రన్రేట్ మెరుగుపరచుకోగలదా..?
పాకిస్థాన్ స్పిన్ వ్యూహం:
మరోవైపు, పాకిస్థాన్ జట్టు పిచ్ నెమ్మదిగా ఉండే పిచ్ స్వభావాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. స్పిన్ విభాగంలో ఉస్మాన్ తారిక్ మిస్టరీ స్పిన్‌తో పాటు సాయిం అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్ లాంటి స్పిన్నర్లను ఉపయోగించాలని చూస్తుంది. మ్యాచ్ చివరి ఓవర్లలో పిచ్ మరింత స్లోగా మారే అవకాశం ఉంది. ఈ స్పిన్ దళం ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు గట్టి సవాల్ విసురుతుంది.
డూ ఆర్ డై మ్యాచ్:
పిచ్, వాతావరణం బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ మ్యాచ్ వ్యూహాత్మక సమరంగా మారే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్‌పై పట్టు సాధించిన జట్టే ఈ కీలక పోరులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్థాన్‌కు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్ కాగా, ఇంగ్లాండ్ మాత్రం తమ ఆధిక్యాన్ని కొనసాగించాలనే టార్గెట్ తో బరిలోకి దిగనుంది.
