జననాయగన్ విడుదల వాయిదా.. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న థియేటర్లు !

జననాయగన్ విడుదల వాయిదా.. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న థియేటర్లు !

సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో విజయ్ జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. తమిళనాడులో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయకపోవడం.. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఈ విషయంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం.. మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచడం.. ఈ పరిణామాల కారణంగా జననాయగన్ సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

విజయ్ జననాయగన్ సినిమా శుక్రవారం (జనవరి 9, 2026) షోలు రద్దయ్యాయని.. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు రీఫండ్ ఇస్తామని.. నేరుగా థియేటర్కు వచ్చి టికెట్ కొన్న ప్రేక్షకులకు జనవరి 8న గురువారం ఉదయం థియేటర్ కౌంటర్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని బెంగళూరులోని విక్టరీ సినిమా యాజమాన్యం ప్రకటించింది.

విజయ్ జననాయగన్ వర్సెస్ సెన్సార్ బోర్డ్ వివాదం ఏంటంటే..
విజయ్ జననాయగన్ సినిమాను సెన్సార్ గండం వెంటాడుతోంది. CBFC ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ చివరి సినిమాకు విడుదల కష్టాలు తప్పడం లేదు. సెన్సార్డ్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మద్రాస్ హైకోర్టులో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాదించింది. ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, సాయుధ దళాలను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించిందని ఆరోపిస్తూ నిర్మాతలకు సెన్సార్ బోర్డ్ నుంచి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.

►ALSO READ | Sivakarthikeyan: సంక్రాంతి రేసు నుంచి 'పరాశక్తి' అవుట్? వాయిదా వెనుక అసలు కారణం ఇదే!

సర్టిఫికేషన్ ప్రక్రియ ముగిశాక ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడిందని.. తక్షణమే సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని సెన్సార్ బోర్డ్ను ఆదేశించాలని జననాయగన్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇరు పక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. జనవరి 9న ఉదయం తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.