‘శుభం’ సినిమాతో సక్సెస్ అందుకున్న యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రం హర్షిత్ రెడ్డి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా కానుందని మేకర్స్ అన్నారు.
