టాలీవుడ్‎కు అసలైన సంక్రాంతి అదే.. మన శంకర వరప్రసాద్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్‎లో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్‎కు అసలైన సంక్రాంతి అదే.. మన శంకర వరప్రసాద్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్‎లో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హైదరాబాద్: ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. అదే టాలీవుడ్‎కు అసలైన సంక్రాంతి పండుగ అని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. 

ఈ క్రమంలో బుధవారం (జనవరి 7) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్  గెస్ట్ రోల్ ప్లే చేశారని.. వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగిందన్నారు. ఇదే కాంబినేషన్‎లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తామని చిరు ప్రకటించారు. 

ఈ సంక్రాంతికి విడుదల అయ్యే అన్ని సినిమాలు మంచిగా ఆడాలని ఆకాంక్షించారు. ప్రభాస్ రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ పరాశక్తి చిత్రాలు హిట్ అవ్వాలని కోరుకున్నారు. అలాగే నా శిష్యుడు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కూడా భారీ విజయం సాధించాలన్నారు. మూవీ ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండాలని.. అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని.. అదే టాలీవుడ్‎కు అసలైన సంక్రాంతి అన్నారు.

►ALSO READ | జననాయగన్ విడుదల వాయిదా.. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న థియేటర్లు !

దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‎లో రూపుదిద్దుకున్న  'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది  పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇందులో చిరంజీవి ఒక మాజీ NIA ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార 'శశిరేఖ' సంపన్న యువతిగా మెగాస్టార్ సరసన నటిస్తోంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక కేమియో పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై భారీ హైప్ నెలకొంది.