బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆయన వార్తల్లో నిలవడానికి కారణం కొత్త సినిమా కాదు, నటి అనన్య పాండేతో కలిసి కనిపించిన ఓ వీడియో!! ఇందులో కరణ్ జోహార్ ప్రవర్తన అనుచితంగా ఉందంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సినిమా ప్రమోషన్ల సందర్భంగా తీసిన ఈ వీడియోలో, కరణ్ జోహార్ కెమెరా ముందే అనన్య పాండే నడుమును తాకినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె నడుమును పట్టుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమయంలో అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు కనిపించడంతో పాటు, కరణ్ జోహార్‌తో ఏదో చెప్పినట్లు వీడియోలో ఉంది.
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో కరణ్ జోహార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు “ఇతను ఎప్పటికీ మారడు” అని కామెంట్లు చేయగా, మరికొందరు “బాలీవుడ్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యక్తి ఇతడే” అంటూ తీవ్ర పదజాలంతో రియాక్ట్ అవుతున్నారు. కొందరు అయితే కరణ్ జోహార్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కరణ్ జోహార్ గతంలో కూడా తన సినిమాలు, ‘కాఫీ విత్ కరణ్’ షో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అంతేకాదు, బాలీవుడ్‌లో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ ఆయనపై ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఎక్కువగా స్టార్ కిడ్స్‌కే అవకాశాలు ఇస్తాడని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని కరణ్ జోహార్ స్వయంగా కూడా కొన్ని సందర్భాల్లో అంగీకరించారు.
►ALSO READ | జనవరి 9న విడుదల కష్టమే.. విజయ్ జననాయగన్ కేసులో తీర్పు రిజర్వ్
ప్రస్తుతం అనన్య పాండే, కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌లో రూపొందిన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ నటించిన ‘తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ’ సినిమా విడుదలై మోస్తరు వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని కూడా ధర్మా ఫిలిమ్స్ నిర్మించింది.
ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే కరణ్ జోహార్–అనన్య పాండే వీడియో బయటకు రావడంతో, ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ వీడియోపై కరణ్ జోహార్ లేదా అనన్య పాండే ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
