తనదైన క్యూట్ యాక్టింగ్‌తో, బబ్లీ నేచర్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ . సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ ముచ్చటించే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నకు ఇచ్చిన చమత్కారమైన సమాధానం ఇచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నేనే పెళ్లి చేసుకుంటాను!
ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా శ్రద్ధా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో సింగిల్‌గా ఉండకూడదంటే గిఫ్ట్ బాక్సులు కొనాలి అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఒక నెటిజన్ ఆత్రుత ఆపుకోలేక, షాదీ కబ్ కరోగే శ్రద్ధా కపూర్? (శ్రద్ధా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?) అని ప్రశ్నించాడు. దీనికి శ్రద్ధా తనదైన శైలిలో మైనే కరోంగి.. వివాహ్ కరోంగి (నేనే చేసుకుంటాను.. నువ్వు కాదు) అంటూ సెటైరికల్‌గా, ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఈ చిన్న కామెంట్ క్షణాల్లోనే వేల సంఖ్యలో లైకులు, షేర్లతో ట్రెండ్ అయ్యింది.
డేటింగ్ రూమర్స్ వేళ..
ప్రస్తుతం శ్రద్ధా కపూర్ వయస్సు 38 ఏళ్లు. గత కొంతకాలంగా ఈమె ప్రముఖ రచయిత రాహుల్ మోడీతో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. గత ఏడాది ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లడం, ఆ తర్వాత వెకేషన్ ఫోటోలు బయటకు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే పెళ్లి విషయంపై ఇప్పటి వరకు ఈ జంట అధికారికంగా స్పందించలేదు. తాజా కామెంట్ తో త్వరలోనే శ్రద్ధా నుంచి తీపి కబురు అందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. శ్రద్ధా కపూర్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. గతేడాది విడుదలైన 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో ఆమె చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 'తుంబాద్' ఫ్రీక్వెల్ 'సహాద్పం గీదా, సూపర్ న్యాచురల్ డ్రామా 'నాగిన్'లో నటించనున్నట్లు సమాచారం. మొత్తానికి అటు సినిమాలు, ఇటు పర్సనల్ లైఫ్ వార్తలతో శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. తన పెళ్లి వార్తలకు ఈమె ఎప్పుడు పుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి..
