నాపై డ్రగ్స్ కేసు కొట్టేయండి: హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్

నాపై డ్రగ్స్ కేసు కొట్టేయండి: హైకోర్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ పిటిషన్

హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమన్ ప్రీత్ సింగ్‎పై డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని ఏ–7గా చేర్చారు పోలీసులు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న అమన్ ప్రీత్ తన న్యాయవాది ద్వారా తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన ఎఫ్​ఐఆర్‎ను క్వాష్ చేయాలని అభ్యర్థించాడు.

ఈ పిటిషన్‎పై మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణ జరిగింది. అమన్ తరుఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సహ నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా అమన్‎ను నిందితుడిగా ఎలా చేర్చుతారంటూ వాదించారు. మరోవైపు.. అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కన్స్యూమర్‎గా అని పోలీసులు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.