కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్‌లో ఇండియాకు రెండు స్వర్ణాలు లభించాయి. విమెన్స్ ఫైనల్లో రెండో సీడ్ ఇండియా 3–0తో మలేసియాను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ 9–11, 11–6, 11–4, 5–11, 11–3తో కరెన్ లినెన్‌పై, స్వస్తిక ఘోష్ 11–7, 11–2, 9–11, 11–9తో అయి జిన్ టీపై, యశస్విని 7–11, 11–3, 17–15, 11–5తో అలీస్ లీ సియాన్‌పై గెలిచారు. మెన్స్ ఫైనల్లో ఇండియా 3–2తో మలేసియాపై గెలిచింది.
మానవ్ ఠక్కర్ 12–10, 11–7, 5–11, 11–5తో జీవన్ చూంగ్‌పై, మనుష్ షా 11–13, 11–9, 11–7, 2–11, 11–7తో క్వి షెన్ వాంగ్‌పై గెలిచారు. కానీ సత్యన్ 7–11, 8–11, 10–12తో హంగ్ యు టే చేతిలో, మానవ్ 11–4, 8–11, 11–8, 7–11, 1–11తో క్వి షెన్ వాంగ్ చేతిలో ఓడారు. దాంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది.
నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో మానుష్ 11–7, 11–4, 11–4తో జీవన్ చూంగ్‌పై గెలిచి టైటిల్ అందించాడు. మరోవైపు వెయిట్ లిఫ్టింగ్‌లో ఇండియా ఖాతాలో మరో పతకం చేరింది. మెన్స్ 110+ కేజీల్లో లవ్‌ప్రీత్ సింగ్ సిల్వర్ మెడల్ నెగ్గాడు. ఫైనల్లో లవ్‌ప్రీత్ మొత్తం 388 (స్నాచ్‌లో 176, క్లీన్ అండ్ జర్క్‌లో 212) కేజీల బరువు ఎత్తి రెండో ప్లేస్‌లో నిలిచాడు.
