కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఇంటర్ స్టేట్ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బి.సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ముకుందారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
చెక్‌పోస్టు వద్ద లారీ డ్రైవర్ల నుంచి పైసలు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఎంక్వైరీ చేసి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
