రైతులకు రాయితీలు సరిగా అందాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్

రైతులకు రాయితీలు సరిగా అందాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రైతులకు ప్రభుత్వ రాయితీలు సరిగా అందేలా  చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను నాగర్​కర్నూల్​ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ప్రభుత్వ రాయితీలు, పథకాలు సజావుగా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆయిల్ పామ్ సాగు, మొక్కల పంపిణీ, మార్కెటింగ్ వంటి అంశాలపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.