వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ లో ఇండియాకు కాంస్యం

వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ లో ఇండియాకు కాంస్యం

ఒంటారియో: వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా మెన్స్‌‌ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌‌లో ఇండియా 0–2తో అమెరికా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌‌లో గురువీర్‌‌ సింగ్‌‌ తొలి గేమ్‌‌ గెలిచినా.. తర్వాత యూఎస్‌‌ ప్లేయర్‌‌ దెబ్బకు చేతులెత్తేశాడు. 

దాంతో 7–11, 11–9, 11–6, 7–11, 3–11తో ఓటమిపాలయ్యాడు. రెండో మ్యాచ్‌‌లో ఆర్యవీర్‌‌ దివాన్‌‌ 5–11, 7–11, 5–11తో యాసిన్‌‌ షలబీ చేతిలో కంగుతిన్నాడు. ఓవరాల్‌‌గా ఈ టోర్నీలో ఇండియా వరుసగా రెండోసారి కాంస్యం సాధించడం ఇదే తొలిసారి.