స్టీల్ పరిశ్రమను తొలగించాలని ‘పోస్ట్‌‌‌‌‌‌‌‌ కార్డ్ ఉద్యమం’

స్టీల్ పరిశ్రమను తొలగించాలని ‘పోస్ట్‌‌‌‌‌‌‌‌ కార్డ్ ఉద్యమం’

మనోహరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి-చెట్ల గౌరారం గ్రామ శివారులోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పంట పొలాలు, భూగర్భ జలాలు దెబ్బతినడంతో పాటు ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలపాలవుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు దాదాపు వెయ్యి పోస్ట్‌‌‌‌‌‌‌‌ కార్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్‌‌‌‌‌‌‌‌కు పంపి పరిశ్రమను తొలగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా జరగలేదని వంటేరు ఆరోపించారు. కలెక్టర్ ఎలాంటి భయభ్రాంతులు లేకుండా పారదర్శకంగా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.