న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) లో భారత ద్రవ్య లోటు రూ.3.1 లక్షల కోట్లకు చేరింది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ లక్ష్యంలో 18.2 శాతానికి సమానమని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం పేర్కొంది.
గత ఏడాది ఇదే టైమ్‌లో ద్రవ్యలోటు రూ.2.8 లక్షల కోట్లుగా ఉంది. ఈసారి ఇన్‌ఫ్రా ఖర్చులు ఎక్కువవ్వడంతో లోటు పెరిగిందని తెలిపింది. 2026–27 కి గాను ద్రవ్య లోటును జీడీపీలో 4.3 శాతానికి (రూ.16.96 లక్షల కోట్లు) పరిమితం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ క్వార్టర్‌లో పన్ను వసూళ్లు రూ.6.4 లక్షల కోట్లకు పెరిగాయి.
