ఏంటో ఏమో ఈ పిచ్చే ప్రేమని

 ఏంటో ఏమో ఈ పిచ్చే ప్రేమని

రాజశేఖర్ వర్మ, రితికా చక్రవర్తి జంటగా వి హరిహరన్ దర్శకత్వంలో రాచమల్లు శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘కాళాంకి భైరవుడు’.  గ్రామీణ నేపథ్యంలో మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ  చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి  రెస్పాన్స్  తెచ్చుకుంది. తాజాగా ‘ఏంటో ఏమో ఈ పిచ్చే ప్రేమని అంటున్నా ..’ అనే పల్లవితో సాగే మెలోడీ సాంగ్‌‌ను విడుదల చేశారు.  ఈ సాంగ్ లాంచ్‌‌ ఈవెంట్‌‌ను విజయవాడలో నిర్వహించారు. ఈ  సందర్భంగా దర్శకుడు హరి హరన్  మాట్లాడుతూ ‘ఈ  సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.  

‘కాష్మోరా’ మూవీలో   రాజేంద్రప్రసాద్ గారి నటనకు ఎంతటి ప్రశంసలు దక్కాయో, అదే స్థాయిలో మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌‌ను పంచుతుంది అని హీరో హీరోయిన్ అన్నారు.  ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత రాచమల్లు శ్రీనివాసరావు అన్నారు.