భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారాచమంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. ఈవో దామోదర్‌రావు, ఈఈ రవీందర్రాజుల ఆధ్వర్యంలో ఆయన ఆలయం చుట్టూ ఉన్న కూల్చివేతలను తనిఖీ చేశారు.
ఉత్తర ద్వారం పనులు వేగంగా చేపట్టేలా దేవస్థానం కాంట్రాక్టర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద వ్యాపారులను షాపులు తొలగించాలని దేవస్థానం ఆదేశించగా, వారంతా ఎమ్మెల్యేను కలిసి పుష్కరాల సమయంలో వ్యాపారం చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. పరిశీలిస్తామని వారికి హామీ ఇచ్చారు.
