టాలీవుడ్‌లో మరో క్యూట్ లవ్‌స్టోరీ ఇప్పుడు పెళ్లి పీటల దిశగా అడుగులు వేస్తోంది. 'బలగం' ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్, దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ.. ఇటీవల తమ ప్రేమను అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. కొంతకాలంగా సాగుతున్న డేటింగ్ రూమర్లకు చెక్ పెడుతూ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ జంట ఏడడుగులు నడవబోతున్నారు.
ఇటీవల కాలభైరవ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కావ్యతో తన అనుబంధాన్ని 'హోమ్‌కి తిరిగి వచ్చిన అనుభూతి'గా ఆయన అభివర్ణించారు. మరోవైపు కావ్య కూడా కాలభైరవ తన సాధారణ రోజులను సైతం ప్రత్యేకంగా మార్చేశాడంటూ ప్రేమగా పోస్ట్ చేసింది. దీంతో ఇది కేవలం రిలేషన్‌షిప్ అనౌన్స్‌మెంట్ కాదని.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ అన్న టాక్ బలపడింది.
అయితే ఇరు కుటుంబాల అంగీకారం తర్వాతే ఈ జంట తమ ప్రేమను బయటకు తీసుకొచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాలభైరవ తండ్రి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కుటుంబం తొలుత ఈ బంధంపై అంతగా ఆసక్తి చూపలేదని, కానీ ఈ జంట తమ నిర్ణయంపై సీరియస్‌గా ఉన్నారని తెలుసుకున్న తర్వాత అంగీకరించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఇక పెళ్లి విషయానికి వస్తే.. ఈ ఏడాది డిసెంబర్‌లోనే కావ్య-కాలభైరవ వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ముహూర్తం, వేదికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్‌లోనే పెళ్లి జరుగుతుందా? లేక డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేస్తున్నారా? అన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు కొడుకు పెళ్లి కోసం కీరవాణి తన పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుని కొంత బ్రేక్ తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 'వారణాసి' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో కొంత భాగాన్ని పూర్తి చేసి పెళ్లి వేడుకలకు సిద్ధమవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కీరవాణి ఇంట కోడలిగా కావ్య.. సంగీత కుటుంబంలోకి అడుగుపెట్టనున్న బలగం హీరోయిన్ అనే ట్యాగ్‌లతో ఈ పెళ్లిపై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
